Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కోవిడ్ చికిత్చకు అనుమతించిన ప్రయివేటు ఆస్పత్రుల డాక్టర్లతో శుక్రవారం కోవిడ్ చికిత్స విది విధానాల గురుంచి రెండో రోజు జూమ్ వేధికగా వరంగల్ అర్బన్ కార్యాలయంలో అర్బన్ డీఎంహెచ్ఓ డాక్టర్ కే లలితాదేవి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి పరిస్థితుల్లో కోవిడ్ పాజిటివ్‌లు అధికంగా నమోదు అవుతున్నాjయని తెలిపారు. అనుమతించిన ఆస్పత్రుల వారందరూ అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నియమాలను అనుసరిస్తూ సహకరించాలన్నారు. ఎప్పటికప్పుడు ఎంత మందికి అందిస్తున్నారో పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్.పి.సుధీర్ ప్రభుత్వ నియమాలను గౌరవిస్తూ జిల్లా యంత్రగానికి పూర్తిగా సహకరిస్తామని క్షేత్ర స్థాయిలో చాలా కష్ట పడి పని చేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు డాక్టర్.పి.ప్రవీణ్ కుమార్, ఎంజీఎం ప్రొఫెసర్ డాక్టర్ పవన్ కుమార్, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్. టీ. మదన్ మోహన్ రావు ,డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్.ఎండి. యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.