Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు పక్కనే బండరాళ్లు వేస్తున్న స్ట్రోన్ క్రషర్ నిర్వహకులు
- ప్రమాదకరంగా ప్రధాన రహదారి
- పట్టించుకోని సంబంధిత అధికారులు
నవతెలంగాణ-రాయపర్తి
మండలం మీదుగా వెళ్లే వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి గుండా అను నిత్యం వందల సంఖ్యలో వాహ నాల రాకపోకలు సాగుతుంటాయి మండ లంలోని కిష్టపురం క్రాస్ వద్ద ఉన్న స్టోన్ క్రషర్ నిర్వాహకులు ఉపయోగపడని బండరాళ్లను రహదారి పక్కనే వేయడం వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవు తున్నారు. రోడ్డుపై నుంచి వెళ్లే వాహనదారులు అదుపు తప్పి రోడ్డు దిగుతే అంతే సంగతులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడమో అంగవైకల్యం పాలవడమో ఖాయం అంటున్నారు వాహనదారులు.
కిష్టపురం క్రాస్ రోడ్డు సమీపంలో మొరిపిరాల గుట్టకు ఆనుకొని పలు క్రషర్లు ఉండగా ప్రస్తుతం మూ డు ఉపయోగంలో ఉన్నాయి. ఒక స్టోన్ క్రషర్ ఉంది. స్టోన్ క్రషర్లో వినియోగంలోకి రాని బండరాళ్లను జాతీ య రహదారి పక్కనే వేస్తున్నారు. బండరాళ్లు అత్యంత పదునుగా ఉండడంతో చిన్న ప్రమాదం జరిగినా పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. బండ రాళ్ళు వేసిన ప్రాంతంలో వాహనాలు రోడ్డు దిగే పరిస్థితి కనిపించడం లేదని వారు తెలుపుతున్నారు. స్టోన్ క్రషర్ నిర్వాహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ జాతీయ రహదారి వెంబడి బండరాళ్ళను వెయ్యడం పట్ల వాహనదారులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మొద్దునిద్ర వీడి స్టోన్ క్రషర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసేంత వరకు సంబంధిత యంత్రాం గం సమస్యలపై దష్టి సారించకపోవడం సబబు కాదని ఇప్పటికైనా స్పందించి జాతీయ రహదారి వెంబడి ఉన్న బండరాళ్లను తొలగించి స్టోన్ క్రషర్ నిర్వాహ కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ముక్తకంఠంతో తెలుపుతున్నారు.
గాల్లో దీపంలా వాహనదారుల ప్రాణాలు
జాతీయ రహదారి వెంబడి బండరాళ్ళు వేయడంవల్ల ఆ దారి గుండా వెళ్లే వాహనదారుల ప్రాణాలు గాల్లో దీపాల్లా తయారవుతున్నాయి. స్థానికంగా ఉండే స్టోన్ క్రషర్ నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు వెంబడి వేసిన బండరాళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రాణ నష్టం జరగకుముందే అధికారులు స్పందించి రాళ్లను తొలగించాలి.
-వెంకటేష్, స్థానికుడు