Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందుల్లో ప్రయాణికులు
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల మానేరు నుంచి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామం వరకు ఇటీవల తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వేయించిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం కురిసిన అకాల వడగండ్ల వానతో మానేరు వరద ప్రవాహం పెరిగింది. దీంతో తాత్కాలిక మట్టి రోడ్డు వరద తాకిడికి పూర్తిగా కొట్టుకు పోయింది. దీంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మంథని నుంచి వయా కొయ్యుర్ మీదుగా రావాలంటే దూర భారం 20 కిలోమీటర్ల మేర, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి పెద్దపల్లి జిల్లా వాసులు వెళ్లాలంటే దూర భారం 40 కిలోమీటర్ల మేర పెరగనుంది. దీంతో మళ్ళీ తాత్కాలికంగా మట్టి రోడ్డు ఎప్పుడు వేస్తారోనని ఎదురు చూస్తున్నారు. మానేరు ప్రవాహం రెండు మూడు రోజుల్లో తీయనుంది.