Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని ప్రముఖ యాత్ర స్థలం అన్నారం షరీఫ్ యాకూబ్ షావలి దర్గాలో బూజు పట్టి పాడైపోయిన లడ్డూలు అమ్ము తున్నారని భక్తు లు ఆరోపి సు ్తన్నారు. శుక్రవారం దర్గా దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు దేవుడి ప్రసాదంగా లడ్డూలు కొనుక్కుని తిందామని చూడగా లడ్డూలు మధ్యలో బూజు పట్టి ఉన్నాయన్నారు. ఇదేమిటని లడ్డూ కాంట్రాక్టర్ను అడగగా నిర్లక్ష్యంగా మీ ఇష్టం ఉన్న చోటా చెప్పుకొండని కర్కశంగా సమా ధానం చెప్పా డన్నారు. ఇట్టి విషయం వక్ఫ్ బోర్డ్ అధికారులకు తెలుపగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టర్ను వెనకేసుకొస్తున్నారన్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్న తాధికారులు స్పందించి తక్షణమే లడ్డూ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.