Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కులమతాలకు అతీతంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేగొండ మండలం రూప ిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత వారి భర్త దేవేందర్ మరియు మండలంలోని ఇతర గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఈ నెల 4వ తేదీన భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో నన్ను కలిశారని ఆ సమయంలో వారితో దాదాపు గంట వరకు ప్రజా సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. అంతే తప్ప వారిపై ఎటువంటి అనుచిత వాక్యలు చేయలేదన్నారు. నాపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నారని మరోఆరి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. నాపై వర్క్ చేస్తున్న అనుచిత వ్యాఖ్య లను ఖండిస్తున్నాను అని ఇలాంటిది ఇది మరోసారి జరిగితే సహించేది లేదన్నారు. యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒకరి అభిప్రాయం మాత్రమే స్వీకరించి కనీస జ్ఞానం లేకుండా మా అభిప్రాయం తీసుకోకుండా నా వ్యక్తిగత ఫోన్ నెంబర్ యూట్యూబ్ లో పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరడం హేయమైన చర్య గా భావించారు. నేను ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి నేను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మెన్ కొత్త హరి బాబు, జెడ్పీ చైర్ పర్సన్ కళ్లెపు శోభ రఘుపతి రావు, భూపాలపల్లి ఎంపీపీ మండల లావణ్య విద్య సాగర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ టౌన్, రూరల్ పార్టీ అధ్యక్షులు మండల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.