Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పలిమెల
మండలంలోని ధమ్ముర్ గ్రామ పంచాయతీలో డీఎస్పీ బోనాల కిషన్, సీఐ నర్సయ్యల ఆధ్వర్యంలో శుక్రవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామం లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి డీఎస్పీ బోనాల కిషన్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్య కలాపలకు దూరంగా ఉండా లన్నారు. చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు ఎవరయినా పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసు కుంటామన్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో మొహానికి మాస్క్ లేనిది ఇంటి నుంచి అడుగు భయట పెట్టకూడదన్నారు. గోదావరి నది పై ప్రజలు పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్కు రాకపోకలు నిర్వహిస్తారు కాబట్టి ఆ ప్రాంతాన్నిర క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఐ నర్సయ్య, ఎస్ఐ శ్యామ్ రాజ్, సివిల్ పొలీస్ సిబ్బంది మరియు సీఅర్పిఫ్ సిబ్బంది పాల్గొన్నారు.