Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ బిందు
నవతెలంగాణ-ఖిలా వరంగల్
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 42వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కేడల పద్మ జనార్థన్ విజయం ఖాయమని మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు అన్నారు. శుక్రవారం ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి కేడల పద్మ జనార్థన్ల గెలుపు కోసం ఆదర్శకాలనీ, నందికుంటతాళ్లు, మహంకాళీ వీధి, రంగశాయిపేటలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ అభ్యర్థుల గెలుపునకు శ్రీరామ రక్ష అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కేడల పద్మ గత పర్యాయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆమె గెలుపునకు నాంది అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఖిలా వరంగల్ చైర్మన్ కేడల జనార్థన్, పరికిపండ్ల ఈశ్వరయ్య, రంజిత్, బజ్జూరి రవి, లక్కాకుల రాజన్న, ఈదుల బిక్షపతి, కనుకుంట్ల రమేశ్, కేడల అశ్విన్‌కుమార్, వెంకటేశ్, మైదం బాలు తదితరులు పాల్గొన్నారు.