Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 44వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి
కంకణాల శ్రీదేవి
నవతెలంగాణ-కాజిపేట
డివిజన్ అభివద్దే ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని 44వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కంకణాల శ్రీదేవి సంపత్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని బట్టుపల్లి గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రజలు తమను ఆశీర్వదించి జరగనున్న ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపిం చాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలని డివిజన్ ప్రజలకు అందేలా నిరంత రం కషి చేస్తానన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా డివిజన్ని అన్ని విధాల అభివద్ధి చేయడానికి నిరంతరం పాటుపడుతనని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూజారి వీరభద్రయ్య, వేణు, రజినీకాంత్, సాదినేని హరీష్, అక్షరు పవన్ తదితరులు పాల్గొన్నారు.