Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాక్సినేషన్‌పై మాటతప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటం
- తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడు శోభన్
నవతెలంగాణ-నర్సంపేట
మోడీ ప్రభుత్వ వైఫల్యమే నేడు దేశంలో కరోనా విలయతాండవం చెందుతుందని తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడు శోభన్ అన్నారు. కడియాల వీరాచారి అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం వరంగల్ రూరల్ జిల్లా సమావేశంలో ముఖ్య అతిథిగా మూ డు శోభన్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయమైన చర్యలు చేపట్టకుండా జనాన్ని మూడత్వంలో ముంచేసి స్వీయ నియంత్రణ పేరిట ప్రగల్భాలు పలుకుతూ వచ్చిందని విమర్శి ంచారు. మరో వైపు ప్రతిఒక్కరికి వాక్సిన్ వేస్తామని నమ్మబలికి చివరకు వాక్సినేషన్ ప్రక్రియను రాష్రాలపై, ప్రజలపై నెట్టేసి చేతులు దులుపు కోవడం అన్యాయమన్నారు. దేశ వాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తుంటే మోడీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలే సిందన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆత్రుతతో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రచార నిర్వహిస్తుందని దుయ్యపట్టారు. పీఎం కేర్ పేరిట వేల కోట్లను వసూళ్లు చేసి ప్రజల ఆరోగ్యానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. పీఎం కేర్ నిధులకు లేక్కే లేకుండా పోయిందన్నారు. కేంద్ర బడ్జెట్లో కరోనా వ్యాక్సిన్ కోసం వేల కోట్లు కేటాయించి తీరా రాష్ట్ర ప్రభుత్వాలను వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని చెప్పి మాటతప్పిందన్నారు. వాక్సిన్ కంపెనీలు లాభపడేలా ఓపెన్ మార్కెట్లో అమ్ము కొనేందుకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. కరోన నియంత్రణలో చర్యలు చేపట్టకుండా అందరికి వాక్సినేషన్ ఉచింతంగా ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఫలితంగా నేడు దేశం సంక్షిష్ట పరిస్థితుల్లోకి నెట్టి వేయబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రతి ఒక్కరికి ఉచిత వాక్సిన్ అందించాలన్నారు. నెలల తరబడి రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయ ఆందోళన పోరాటాలు చేస్తుంటే ప్రధాని మోడీ పోలీలచే అణిచివేసే చర్యలతో విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నాడే గానీ రైతు సమస్యలను పరిష్కరించింది లేదన్నారు. ఇలాంటి తరుణంలో దేశ ప్రజలు, రైతులు ప్రభుత్వ వైఫల్యాలపై, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రైతు సంఘం నిరంతర పోరాటాల వైపు రైతులను సమీకరించాలని సూచించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు కొరబోయిన కుమారస్వామి, పుచ్చకాయల కష్ణారెడ్డి, ఈసంపెల్లి బాబు, సీహెచ్్ నరసింహారెడ్డి, ఎస్కే. అన్వర్, ముంజాల సాయిలు, చింతకింది తిరుపతి, కే.రమేష్, నరసింహారెడ్డి, బోళ్ల సాంబయ్య,శ్రీనివాసరెడ్డి ఈ.అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.