Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూ శాయంపేట
31వ డివిజన్లో సీపీఐ(ఎం) అభ్యర్థి మంద సంపత్ కార్యకర్తలతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే సుత్తి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అంతేకాకుండా గత 30 సంవత్సరాలుగా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికీ వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వలేదని ఇంటి నెంబర్స్ కూడా లేవన్నారు. సైడ్ డ్రయినేజీ లేకపోవడంతో వర్షం కురిసిందంటే ముంపునకు గురవుతున్నారని తెలిపారు. సీపీఐ(ఎం)ని గెలిపిస్తే ప్రజాలకి మెరుగైన సేవలు అందిచేందుకు కృషి చేస్తానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో అలా కుంటా యాకయ్య, దాసరి నరేష్, బొల్లారం సంపత్, దూడపాక రాజేందర్, మేకల రగుపతి, చేరిపెళ్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.