Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వతంత్య్ర అభ్యర్థి బస్వరాజు కుమారస్వామి .
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
12వ డివిజన్ అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తానని స్వతంత్య్ర అభ్యర్థి బస్వరాజు కుమారస్వామి అన్నారు. శుక్రవారం వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండో డివిజన్ లోని లక్ష్మి టౌన్షిప్ దగ్గరలో ఉన్న ఎంపీ ఆర్ నగర్ గుడిసె వాసులకు శాశ్వత పట్టాలు అందేలా కషి చేస్తానన్నారు. సీసీ రోడ్లు, డ్రయినేజీల ఏర్పాటుకు కషి చేస్తానని తెలిపారు. స్లమ్ ఏరియాలు ఇంతవరకు అభివద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని వాటిని అభివృద్ధి చేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కషి చేస్తానన్నారు డివిజన్ ప్రజలు ఆశీర్వదించి యాపిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే డివిజన్ను అద్భుత రీతిగా అభివద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిరాజు, సురేష్, రమేష్ , తెలంగాణ రాజు, మోసిన్ ,ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.