Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్కు జంగా రాఘవరెడ్డి బహిరంగ లేఖ
నవతెలంగాణ-కాజిపేట
వరంగల్ నగరంలో 183 మురికి వాడలుండగా అందులో 65 వేల కుటుంబాలు నివాసముంటున్నాయని, ఈ మురికివాడలను గడిచిన ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైనా పట్టించుకుందా అంటూ జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి కేటీఆర్కు బహిరంగ లేఖను రాశారు. నగరంలో 2.65లక్షల మంది అంటే సుమారు 42 శాతం జనాభా మురికివాడల్లోనే బతుకుతున్నారని ఇందులో అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు, బీడీ కార్మికులే ఎక్కువగా ఉన్నారన్నారు. గ్రేటర్ లో విలీనమైన 42 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తే మరిన్ని మురికి వాడలు బయట పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. దాదాపు 50 శాతం జనాభా మురికి వాడల్లో నివసిస్తున్నారంటే కేసీఆర్ పాలనలో నగర జీవన నాణ్యతలో నివాస యోగ్యత ఏ స్థాయిలో ఉందో మంత్రి కేటీఆర్ సమా ధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడేళ్ల పాలన కాలంలో మురికివాడల్లో కనీస వసతులు కల్పించారా? తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పారిశుద్ధ్యం అద్వాన్నంగా మారిం దని, బురదతో నిండిన ఇరుకు రోడ్లు,దోమలతో రోగాలతో కాలనీల వాసులు సహజీ వనం చేస్తున్నట్టు తెలిపారు. విద్యా,వైద్య సౌకర్యాలు కల్పించని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇపుడు ఏ మొఖం పెట్టుకొని గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గుడిసెలకు ఇంటి నెంబర్లు, మురికి వాడల్లోని నివాస ప్రాంతాల్లోనే ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని సవాల్ విసిరారు.