Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటేసి గెలిపించండి..
టీఆర్ఎస్ అభ్యర్థి గుండేటి నరేంద్ర
- 20వ డివిజన్లో జోరందుకున్న ప్రచారం
నరేంద్ర విజయం ఖాయం : ఎమ్మెల్యే పెద్ది
నవతెలంగాణ-కాశిబుగ్గ
తనకు ఓటేసి గెలిపించాలని.. సుపరిపాలన అందిస్తానని టీఆర్ఎస్ పార్టీ 20వ డివిజన్ అభ్యర్థి గుండేటి నరేంద్రకుమార్ ప్రజలను కోరారు. ఆ డివిజన్ పరిధిలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులు నరేంద్ర గెలుపు కోరుతూ భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి నరేంద్రకుమార్ ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్ ప్రజలతో మాట్లాడారు. స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన పోరులో క్రియాశీలకంగా పాల్గొని అప్పటి ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాసమస్యల పరిష్కారంలో క్రియాశీలకంగా పని చేసినట్టు తెలిపారు. గతంలో టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్‌గా ప్రజలకు సేవలు అందించినట్టు చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. నిత్యం ప్రజల్లో ఉంటూ అందరి సమస్యల పరిష్కారానికి, డివిజన్ సంపూర్ణ అభివృద్ధికి అవిశ్రాంతంగా పాటుపడతానని తెలిపారు.
గుండేటి నరేంద్ర గెలుపు ఖాయం : పెద్ది
20వ డివిజన్లో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన గుండేటి నరేంద్రకుమార్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని నర్సంపేట ఎమ్మెల్యే, డివిజన్ ఎన్నికల ఇన్‌ఛార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ ప్రజలకు నరేంద్రకుమార్ సుపరిచితుడని తెలిపారు. గతంలో ప్రజలకు సేవలు అందించిన చరిత్ర నరేంద్రకుమార్‌కు ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పథకాలతోపాటు నరేంద్రకుమార్ సేవాభావం అతడి గెలుపునకు బాటలు వేస్తాయని చెప్పారు. గతంలో కార్పొరేటర్‌గా, స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా సేవలు అందించిన నరేంద్రకుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈకార్యక్రమంలో పార్టీ పరిశీలకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.