Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి బాధ్యత మాది
టీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించండి..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-వరంగల్
చేతులెత్తి మొక్కుతున్నా.. అభివృద్ధి బాధ్యత మాది.. గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను నగరవాసులు ఆశీర్వదించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. హన్మకొండలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. 66 డివిజన్లలో అన్ని సామా జిక వర్గాలకు అవకాశమిచ్చా మని చెప్పారు. బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. బీసీలకు 39, ఎస్సీలకు 13, ఎస్టీలకు 2, ఓసీలకు 8, ముస్లిం మైనార్టీల కు 4 డివిజన్లు కేటాయించామని వివరించారు. అభివృద్ధికి బహుమ తిగా టీఆర్ఎస్కు ఓటేయ్యాలని కోరారు. వరంగల్ నగరంలో రూ.2,579 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ కింద లక్షా 77 వేల 588 కోట్లు ఖర్చు పెడితే వరంగల్‌లో రూ.939 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.87.78 కోట్లు వెచ్చించామని తెలపారు. సమీకృత మోడల్ మార్కెట్ల నిర్మాణానికి రూ.39.87 కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి రూ.5.70 కోట్లు, రైల్వే బ్రిడ్జిలకు రూ.67.80 కోట్లు, జంక్షన్ సుందరీకరణకు రూ.1.93 కోట్లు, మురుగునీటి కాల్వల అభివృద్ధికి రూ.179.50 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.478.03 కోట్లు, మోడల్ వైకుంఠధామాలు, పార్కుల నిర్మాణానికి రూ.39.87 కోట్లు వెచ్చిస్తున్నామని తెలి పారు. నగరంలో ఇప్పటికే 479 మంది నిరుపేదలకు పట్టాల చేతులెత్తి మొక్కుతున్నా...
పంపిణీ చేశామన్నారు.
ఆక్సీజన్ కొరతొస్తే కేంద్రానిదే బాధ్యత..
రాష్ట్రంలో ఆక్సీజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అన్నారు. యావత్ తెలంగాణ తరుపున కేంద్రానికి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ధరల్లోనూ తేడాలు పెట్టడం కేంద్రం సంకుచిత ధోరణికి నిదర్శనమన్నారు. రాష్ట్రాలకు రూ.400లు, ప్రయివేట్ ఆస్పత్రులకు రూ.600లు పెట్టడం సరికాదన్నారు. దేశ ప్రజలందరినీ కాపాడే బాధ్యత కేంద్రానికి లేదా ? అని ప్రశ్నించారు. రెమిడిసివెర్ ఇంజక్షన్లు మన దగ్గర తయారైనా మనకే అందుబాటులో లేకుండాపోయిందన్నారు. కేంద్రం మొత్తం పంపిణీ వ్యవస్థను తన కంట్రోల్లోకి తీసుకొని రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించిందని ధ్వజమెత్తారు. పొరుగునున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఏపీ పేషంట్లు ఎక్కువ మంది తెలంగాణ ఆస్పత్రుల్లో చేరుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు చెప్పినా స్పందన లేదన్నారు. కేంద్రానికి 4 లక్షల రెమిడిస్వేర్ ఇంజక్షన్లు ఆర్డర్ పెడితే 10 రోజుల్లో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 21 వేల 500 మాత్రమేనని చెప్పారు. గుజరాత్‌కు లక్షా 63 వేలు, మహారాష్ట్రకు 2 లక్షలు, ఢిల్లీకి 61 వేలు, మధ్యప్రదేశ్‌కు 92 వేల ఇంజక్షన్లు ఇచ్చారని వివరించారు. కేంద్రం చూపిస్తున్న వివక్షను ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీలు ఇవ్వని కేంద్రం చివరకు కరోనా వేళ అవసరమైన ఇంజక్షన్లు, ఆక్సీజన్ ఇవ్వడానికి వివక్ష ప్రదర్శించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను రక్షించే బాధ్యత కేంద్రానికి లేదా ? అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, బొంతు రామ్మోహన్, దాస్యం విజరుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.