Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు జమాత్ ఇస్లామ్ హింద్ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎంఏ రఫిక్ ఆధ్వ ర్యంలో రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా 35 పేద కుటుంబాలకు గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఫీక్ మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ పవిత్ర మాసంలో నిరుపేద ము స్లిం కుటుంబాలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపు కు నేందుకు వారికి నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందని అదే మాదిరిగా ఈ ఏడాది కూడా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో షఫీక్, అజీజ్, అక్బర్ సోహెల్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.