Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ సంపత్ కుమార్
నవతెలంగాణ-నల్లబెల్లి
ప్రతి ఒక్కరూ పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని తహసీల్దార్ సంపత్‌కుమార్ అన్నారు. గురువారం మండలం కేంద్రంలో డెవలప్మెంట్ రూరల్ మదర్ మినీ పొదుపు సేవా సహకార సంఘాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పొదుపు చేసుకోవడం అలవాటు చేసు కోవా లన్నారు. రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడడానికి, ఆర్థికంగా నిలదొక్కు కోవడానికి తప్పనిసరిగా పొదుపు అవసరమన్నారు. ఇలాంటి సమిష్టి పొదుపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే పొదుపు సంఘా లను బలోపేతం చేసేందుకు కషి చేయా లన్నారు. అనంతరం సంఘానికి సంబంధించిన వివ రాల ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పేద కుటుం బాలకు చెందిన ముగ్గురికి చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి దాసరి రవి, సిబ్బంది బట్టు సాంబయ్య, శరత్, భాస్కర్, వినరు, రాము, హుస్సేన్, రాజు, బాలరాజు పాల్గొన్నారు.