Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఎంసీలో జనరల్ సేవలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ ఎంజీఎంను పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మారుస్తున్నరట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే 1నుంచి ఎంజీఎంను 1250 పడకలతో పూర్తి కోవిడ్ ఆస్పత్రిగా మారుస్తున్నట్టు తెలిపారు. జనరల్ సేవలకోసం శుక్రవారం వారం నుంచి కేఎంసీలో 150 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకు రాను న్నట్టు చెప్పారు. ఇప్పటికే సదుపాయాలు కల్పిం చామని, అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తామని తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకు న్నామన్నారు. ఎంజీఎంలో ఆక్సిజన్ కొరత ఎక్కడా లేదని ,ప్రస్తుతం 130 రెమ్డెసివిర్ డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. చిన్నచిన్న లోపాలు ఉన్నప్పటికి ఎంజీ ఎంలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. ఎమర్జెన్సీ కింద 250 పడకలతో కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి ఒక వార్డుతో సేవలు ప్రారంభిస్తామన్నారు. ఎంజీఎం నుంచి కొందరు రోగులను ఇక్కడికి షిప్ట్ చేస్తామన్నారు. కోవిడ్ రోగులు అధైర్య పడొద్దన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డా.సంధ్య మాట్లాడుతూ కెేఎంసీలో ప్రస్తుతం 50పడకలతో జనరల్ వార్డు ఏర్పాటు చేస్తామని అనంతరం 300పడకలకు పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరిండెంట్ డా.కె నాగార్జున రెడ్డి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలన
పోచమ్మ కుంట అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను గురువారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.