Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భౌతిక దూరంకై చర్యలు శూన్యం
- వ్యాక్సినేషన్‌పై వైద్యాధికారుల పట్టింపు కరువు..
నవతెలంగాణ-నర్సంపేట
ఆస్పత్రుల ఎదుట వాక్సిన్ కోసం బారులు తీరుతున్నారు..ప్రస్తుతం 45 యేండ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా రోజంటికీ వాక్సిన్ వేసుకొనే వారి సంఖ్య పెరుగుతుంది. పట్టణంలోని బాలికల పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంటర్ వద్ద పెద్ధ సంఖ్యలో చేరుకున్నారు. భౌతిక దూరం పాటించేలా వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. దగ్గరగా గుమికూడడంతో కరోనా వైరస్ భారిన పడే ప్రమాదం లేకపోలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరులో ఆయా పీహెచ్‌సీల వద్ద వాక్సినేషన్ ప్రక్రి యను అధికారులు గాలికొదిశారనే విమర్శలు వెలువడుతున్నాయి. కరోనా కట్టడి చర్యలు చేపట్టడంలో దృష్టి సారించడంలో వైద్య శాఖ ఇతర శాఖల అధికారులు ఆదమర్చడం ఎంతవరకు సమంజమని పలువురు ప్రశ్ని స్తున్నారు. ఇప్పటికైనా వాక్సినేషన్ సెంటర్ల వద్ద భౌతిక దూరం పాటిం చేలా చర్యలు చేపట్టాలని స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధి బొజ్జంకి ప్రభా కర్ కోరుతున్నారు. భౌతిక దూరం పాటించకపోవడం వల్ల మరింతగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉన్నందున జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన చెప్పారు.