Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి
నవతెలంగాణ-నర్సంపేట
మేడే స్పూర్తితో మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వాడవాడన సీఐటీయూ జెండాలు ఎగుర వేయాలని వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి అన్నారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో రవి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా చట్టాలను తీసుకొచ్చిందన్నారు. ప్రధాని మోడీ నిర్లక్ష్యం వల్ల కరోనా రెండో వేవ్ తార స్థాయికి చేరుకుని లక్షలాది మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ మీడియా సైతం మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరించటాన్ని తీవ్రంగా తప్పు పట్టాయని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతగాని తనం మూలంగా వలస కార్మికులు తిరిగి రెండవ సారీ ఇంటి బాట పడుతూ ఆకలితో అలమటించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మోడీ ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల విధా నాలను వీడాలని, కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి కోల్పో తున్న ప్రతి కార్మిక కుటుంబాలకు 25 కేజీల బియ్యం, రూ.7,500 నగదు సహా యాన్ని అందించి ప్రతి ఒక్కరికి ఉచితంగా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. కరోనా పేరుతో కార్పొరేట్ ఆసు పత్రుల దోపిడీ అరికట్టాలన్నారు. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతి కార్మికుడు కరోనా నిబంధనలు పాటిస్తూ మేడే లో తప్పని సరిగా మాస్కులు ధరించి పని ప్రదేశాల్లో సీఐటీయు జెండాలు ఎగురవేయాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యులు కోట రవి, నాయకులు కందికొండ రాజు, అచ్చం కుమారస్వామి, గుజ్జుల ఉమా, మధు, పల్లకొండ రాజు, పిట్టల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.