Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్‌కు
- గురుకుల గెస్ట్ టీచర్ల వినతి
నవతెలంగాణ-న్యూ శాయంపేట
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గురుకుల సొసైటి (బీసీ సోషల్ వెల్ఫేర్) లలో పనిచేస్తున్న దాదాపు మూడు వేల మంది గెస్ట్ టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గురువారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌ను తన నివాసంలో కలిసి తెలం గాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల సొసైటీల సొసైటీల గెస్ట్ టీచర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గెస్ట్ అండ్ పార్ట్ టైం టీచర్లు ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగింపు రోజున తొలగించడం అనేది గురుకుల సొసైటీలకు ఆనవాయితీగా మారిందని అది మాత్రం మాకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వినోద్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గురుకుల సొసై టీల గెస్ట్ మరియు పార్ట్‌టైమ్ టీచర్లు, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రమేష్, భాస్కర్, కుమార్, నరేందర్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.