Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైస్ ఎంపీపీ శారద శంకరయ్య కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైస్ ఎంపీపీ దార శారద శంకరయ్య సూచించారు. గురువారం మండలంలోని బొమ్మెర, తిరుమలగిరి, శాతపురం, మల్లంపల్లి, బిక్య నాయక్ పెద్దతండ, వావిలాల గ్రామాల్లోని లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులు లతో కలిసి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించి అండగా ఉండడం అభినందనీ యమన్నారు. కరోనా కట్టడి లో భాగంగా నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి అధికారులు ప్రజాప్రతినిధులతో చెక్కులను అందజేయడం మంచి పరిణామమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఐ కొండమల్ల రవి, ఏఆర్ఐ భూక్య కస్నా నాయక్, సర్పంచులు గంట పద్మ భాస్కర్, జలగం భూషణం బక్క పుల్లయ్య, గుగులోత్ ఆలు నాయక్, పసులాది సుశీల, గిరగాని హేమలత కుమారస్వామి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.