Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యాధికారి జయపాల్
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
కరోనా కష్ట కాలంలో అనునిత్యం ప్రజల కోసం కష్ట పడుతూ వైద్య సిబ్బందితో కలిసి వైద్య సేవలు అంది స్తున్నామని ప్రాథమిక వైద్యాధికారి జయపాల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బంది అహర్నిశలు ప్రజల కోసం కష్ట పడుతూ విధులను అంకిత భావంతో నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కోవిడ్ నివారణలో భాగంగా మండలంలో ఒక నెలలో ఆరు వేల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. 200మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 65 మందికి పాజిటివ్ గా వచ్చిందన్నారు. వైద్య సిబ్బంది సమిష్టి కృషితో కరోనా కట్టడిలో ముందంజలో ఉన్నామన్నారు. ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి ఒక్కరికీ కరోనా జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుండి వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తుంటే బుధవారం ఓ దిన పత్రికకు సంబంధించిన పాత్రికేయుడు సీిహెచ్ఓ వెంకట స్వామి, స్టాఫ్ నర్సు మమతలు దురుసుగా ప్రవర్తించారని వార్త రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. దిన పత్రిక లో వచ్చిన వార్తతో వైద్య సిబ్బంది తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలిపారు. కరోనా సమ యంలో కుటుంబానికి దూరంగా ఉంటూ సేవలు చేస్తున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైందికాదన్నారు. ఈ సమావేశంలో వైద్య సిబ్బంది మహేశ్వరి, సిహెచ్ ఓ వెంకట స్వామి, స్టాఫ్ నర్సు మమత, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.