Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనుకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో కరోనా రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కరోనా టెస్టులు చేసి, అందరికి ఉచితంగా వ్యాక్సిన్ వేసి జిల్లా ప్రజల్ని ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనుకారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, జనగామ పట్టణం లోని వార్డుల్లో కరోనా టెస్టులు చేసి, వ్యాక్సిన్ అందరికీ వేయాలన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చినవారికి మెరుగైన వైద్యం అందించాలని, జిల్లాలో అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో రైతు వేదిక కేంద్రాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మెరుగైన వైద్యం అందించడానికి అదనపు సిబ్బందిని నియమించాలని అన్నారు. వారికి అదనపు వేతనం ఇవ్వాలని అన్నారు. పట్టణ, గ్రామపంచాయతీ సిబ్బందిని పెంచి వారికి అదనపు వేతనం ఇవ్వాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి కుటుంబానికి రూ.7,500 ఆరు నెలల పాటు ఇవ్వాలని అన్నారు. ప్రయివేటు టీచర్స్, లెక్చరర్స్‌కు రూ.10వేలు ఇవ్వాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సిబ్బందికి, కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వాలని రూ.10వేలు ఆరు నెలల పాటు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాపర్తి రాజు, పి ఉపేందర్, జై ప్రకాష్, బి వెంకటమల్లయ్య, ఆనందం ఎన్ మల్లయ్య, ఎండీ అజారుద్దీన్, ఉపేందర్, ఎండీ బురాన్, సీహెచ్ ఉపేందర్ యు వేణు, వినోద్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.