Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పాలకుల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా వాడవాడలా మేడే ఉత్సవాలు నిర్వహించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు కోరారు. జిల్లా కేంద్రంలోని ఆ యూనియన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చుతోందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా రెండో దశ ఉధృతం అవుతోందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కార్మిక కుటుంబాలకు ప్రతినెలా 25 కేజీలు బియ్యంతోపాటు రూ.7 వేల 500లు నగదు సాయం అందించాలని, ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే మేడే నిర్వహించాలని కోరారు. యూనియన్ జెండాలు ఎగరేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కుంట ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు తోట భిక్షం, పట్టణ కన్వీనర్ కుమ్మరికుంట్ల నాగన్న, నాయకులు తోట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.