Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ వేయకపోవడంతో నిరాశతో వెనుతిరితగిన ప్రజలు
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 45 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించినప్పటికీ వారికి సరి పడా వ్యాక్సిన్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేయకపోవడంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడుతుంది. దీంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చిన ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిరీక్షించినప్పటికీ వ్యాక్సిన్ కొరత వల్ల వేయలేక పోతున్నామని వైద్య సిబ్బంది తెలపడంతో నిరాశగా వెనుదిరిగి వెళ్తున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వ్యాక్సిన్ కొరత వల్ల మంగళవారం వ్యాక్సిన్ పంపిణీ నిలిచిపోయింది. దీంతో బుధవారం పెద్ద సంఖ్యలో చేరుకుని వ్యాక్సిన్ టీకాలు తీసుకున్నారు. గురువారం ఉద యమే మండల పరిధిలోని గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకు న్నప్పటికీ వ్యాక్సిన్ కొరత వల్ల వైద్య సిబ్బంది టీకా పంపిణీ చేపట్టలేక పోయారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్యాకేజీల కోసం ఎదురుచూసి ప్రజలు నిరాశగా వెనుదిరిగిన వెళ్లిపోయారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించగా 45 ఏళ్లు పైబడిన వారికి సక్రమంగా వాక్సిన్ పంపిణీ చేయలేకపోతున్నారని, 18 ఏళ్లు పైబడిన వారికి అంటే వేల సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని, అందరికీ వ్యాక్సిన్ ఎలా పంపి ణీ చేస్తారని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. వరంగల్ రూరల్ జిల్లాలో 16 మండలాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, గురువారం కేవలం 9 మండలాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ జరిగినట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో అందుబాటులో ఉంచాలని మే 1 నుంచి 18 ఏళ్లకు పై బడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తుండడంతో గ్రామాల్లోనే వ్యాక్సినేషన్ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నల్లబెల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ గురువారం ఇవ్వకపోవడంతో మండలంలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వ్యాక్సిన్ కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపుగా 50 మందికి పైగా ఉదయం 7 గంటలకు వచ్చి 11 గంటల వరకు వేచి ఉన్న ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. దీని గురిచి పీహెచ్సీ వైధ్యాధికారిని వివరణ కోరగా జిల్లా నుంచి వ్యాక్సిన్ రాకపోవడంతో వేయలేదని తెలిపారు.