Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలోని నాగసముద్రం చెరువులోని నీటిని చేపల యజమాని అక్రమంగా తూము ద్వారా నీటిని విడుదల చేయడం వల్ల చెరువులోని నీరంతా వధాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చేపల యజమానిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని నాగసముద్రం చెరువులో యాసంగి సీజన్‌కు నీరు సమద్ధిగా ఉన్నప్పటికీ చౌడు భూములుగా మారడంతో పంట దిగుబడి తగ్గుతుందని యాసంగి సీజన్లో పంట సాగు చేయవద్దని ఆయకట్టు రైతులు అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. చెరువులోకి ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా నీరు పుష్కలంగా చేరడంతో చేపల పెంపకానికి కాంట్రాక్ట్ దక్కించుకున్న చేపల యజమాని వారం రోజుల క్రితం బుర్ర తూము షట్టర్ లాక్ ను పగలగొట్టి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఇదే విషయమై ఆయకట్టు రైతులు పరకాల శ్రీధర్, ప్రపంచరెడ్డి, గట్టు సదానందం, నీల రమణారెడ్డి, వంగాల పరమేశ్వర్, కానాపురం ప్రకాష్, ప్రతాప్‌లు స్థానిక పోలీస్ స్టేషన్లో, తహసీల్దారు కార్యాలయంలో, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. చెరువు నీరు పోకుండా బస్తాలలో నింపి తూముకు అడ్డంగా వేశారు. అయినప్పటికీ చేపల కాంట్రాక్టర్ మిట్ట తూము గుండా నీటిని విడుదల చేశాడు. దీంతో రైతులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో నీటి పారుదల శాఖ అధికారులు చేరుకొని తూము మూసివేశారు. చేపలు పట్టుకోవడమే లక్ష్యంగా చేపల కాంట్రాక్టర్ బుర్ర తూము వద్ద వేసిన ఇసుకబస్తాలు తొలగించడంతో నీరు పంట పొలాల్లోకి చేరి బురదమయంగా మారిందని, మరో రెండు నెలల్లో వానకాలం పంట సాగు చేయడానికి కేజీ వీల్స్ నడిచే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నీరు సమద్ధిగా ఉన్నప్పటికీ పంట పొలా లు గట్టిపడడానికి యాసంగి పంట సాగు చేయలేదని, చేపల కాంట్రాక్టర్ నీరు విడుదల చేయడం వల్ల ల తాము నష్టపోవాల్సి వస్తుందని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చేపల కాంట్రాక్టర్ పై చర్య తీసుకొని తూము మరమ్మతు పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.