Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని అధికార యంత్రాంగం
- నియంత్రణా చర్యలు శూన్యం
నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలంలో కరోనా మహమ్మారి కల్లోలం సష్టిస్తున్నది నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. కరోనా మహమ్మారితో మృతి చెందుతున్న మతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించి ప్రజలకు ధైర్యం చెప్పవలసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. గ్రామాలలో ఉండి నియంత్రణ చర్యలతో పాటుగా ప్రజలకు మనోధైర్యం కల్పించాల్సిన గ్రామ ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు కొందరు స్థానికంగా ఉండకపోవడం, మరి కొందరు ప్రజా ప్రతినిధులు ఉప ఎన్నికలు గ్రేటర్ ఎన్నికల అంటూ నగరాలకు తరలిపోయి పార్టీల పక్షాన ప్రచారం నిర్వహిస్తూ గ్రామాలను గాలికి వదిలేయడంతో గ్రామాల్లో నియంత్రణా చర్యలు చేపట్టే నాధుడే కరువయ్యాడు. మండలం లోని దమ్మన్నపేట గ్రామంలో కరోనా విలయతాండవం సష్టిస్తుంది. గడిచిన ఐదు రోజులలో ముగ్గురు వ్యక్తులు కరోనాతో మృతిచెందడంతో భయం గుప్పిట్లో గ్రామస్తులు కాలం వెళ్లదీస్తున్నారు. స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధులు స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు మాత్రం వరంగల్ హనుమకొండ నగరాలలో నివాసముంటూ వారి సొంత రక్షణకే పరిమితమవుతున్నారు. కనీసం గ్రామాలలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడంలో కూడా ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపక పోవడంతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతి నిధులు, అధికారులు స్పందించి కరోనా సోకిన వ్యక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని నియంత్రణా చర్యలు చేపట్టాలని వర్థన్నపేట మండల ప్రజలు కోరుతున్నారు.