Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలావరంగల్
దళిత, బడుగు, బలహీన వర్గాలకు బొమ్మల కట్టయ్య అందించిన సేవలు ఎనలేనివని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. బుధవారం ఆమె కరీమాబాద్‌లోని బొమ్మల కట్టయ్య ఇంటి వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎలుక నిశాంత్, బొమ్మల అంబేద్కర్, తరాల రాజమణి, గౌతమ్, సుజాత, స్థానిక నాయకులు ఎరుకల మహేందర్, నీలం మల్లేశం, కుమార్, రవితేజ, సునీల్, సిద్ధార్థ, శ్రీలత, నాగమణి, రాంప్రసాద్, రవి, మధు తదితరులున్నారు. బొమ్మల కట్టయ్యకు సంతాపంబొమ్మల కట్టయ్య మృతికి చాంబర్ ఆఫ్ కామర్స్ రైస్ మిల్ సెక్షన్ జిల్లా అధికార ప్రతినిధి నీల మల్లేశం సంతాపం తెలిపారు. బుధవారం ఆయన బొమ్మల కట్టయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎరుకల మహేందర్, కడారి కుమార్ తదితరులు పాల్గొన్నారు.