Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
గ్రేటర్ వరంగల్ 34, 35 డివిజన్లకు చెందిన కరోనా బాధితులకు మేరుగు అశోక్ ఆధ్వర్యంలో బుధవారం పౌష్టికా హారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేరుగు అశోక్ మాట్లా డుతూ కరోనా బారిన పడిన నిరుపేదలు కరోనాను జయించేం దుకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్టు తెలిపారు. శివనగర్ పరిధిలో కరోనా బాధితులు ఎవరికైనా పౌష్టికాహారం అవసరము న్నట్టయితే 9848163734 సెల్ నెంబర్లో సంప్రదిస్తే నేరుగా ఇంటికే ఆహారం పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం రవి, వేంగళదాసు కష్ణ , ఎండీ సలిమ్, రామ సందిప్, బేర కిషన్, అంకతి అఖిల్, శివా తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట : గ్రేటర్ వరంగల్ ఖాజీపేట మండలం 44వ డివిజన్ పరిధిలోని కడిపికొండ గ్రామానికి చెందిన మేకల కుమారస్వామి ఇటీవల మరణించగా బాధిత కుటుంబ సభ్యులకు స్థానిక కార్పొరేటర్ జలగం అనిత రంజిత్ అందజేసిన బియ్యాన్ని బీజేపీ నాయకులు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లా యాదవరెడ్డి, టాటాచారి, కుమార పాల్గొన్నారు.
చెన్నారావుపేట : మండలంలోని ఎల్లయ్యగూడెం గ్రామానికి చెందిన సామాజిక తెలంగాణ రిపోర్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, విషయం తెలుసుకున్న సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందికొండ విజరు, కందకట్ల రాజారామ్,సొసైటీ డైరెక్టర్ సరిత వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నెక్కొండ రూరల్ : కరోనాతో ఇబ్బందులు పడుతున్న తండావాసులకు బుధవారం కస్నాతండా సర్పంచ్ బానోత్ రవినాయక్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కస్నాతండాలో హెల్పింగ్ హ్యాండ్స్ సహకారంతో కూరగాయలు, పండ్లు, గుడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కవితాగోపినాయక్, ఉపసర్పంచ్ తులసీరాం పాల్గొన్నారు.
అమీన్‌పేటలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి:
మండలంలోని అమీన్‌పేటలో సర్పంచ్ గరికపాటి హనుమంతరావు ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. కరోనా బాధితులు ఇళ్లలోనే క్వారంటైన్లో ఉండాలని, నిత్యావసర సరుకులు అందిస్తామని, జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ కోరారు.
కాశిబుగ్గ : కరోనా బాధితులకు, లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు, అనాధలకు ప్రముఖ వ్యాపారి మడిపల్లి కష్ణ బుధవారం ఆహారం ప్యాకెట్లు అందజేశారు.. ఈ సందర్భంగా మడిపల్లి కష్ణ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు బుధవారం సీకేఎం, ఎంజీఎం, ఈఎస్ఐ హాస్పిటల్, చార్‌బౌలీ, ఓ సిటీ, లేబర్ కాలనీ తదితర ప్రాంతాల్లో సుమారు 500 ఆహార ప్యాకెట్లు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన కట్ కక్కెర్ల అనిత గౌడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.