Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీఎం సూపరిండెంట్ చంద్రశేఖర్
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం వచ్చిన బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందిం చేందుకు వైద్యులు కషి చేస్తున్నారన్నారు వరంగల్ ఎంజీఎం సూపరిండెంట్ డాక్టర్ వలపదాసు చంద్రశేఖర్ అన్నారు. ఆసుపత్రి కొత్త సూపర్డెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా విలేకరులతో బుధవారం మాట్లాడిన ఆయన ఆస్పత్రిలో సమస్యలు ఉన్న మాట వాస్తవమే అని వాటిని సరిదిద్దెందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళతామన్నారు. ప్రస్తుతం 650 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారని వారికి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది కోవిడ్ వార్డులో విధులు చేసేందుకు నిరాకరిస్తు న్నారని అనడం వాస్తవం కాదని బాధితులకు చికిత్స చేసిన వైద్యులు, సిబ్బంది కోవిడ్ బారినపడి కోలుకుని తిరిగి రోగులకు సేవ చేస్తున్నారన్నారు. కరోనా బాధితులకు అందరికీ సరిపడా ఆక్సిజన్ అందుతుందని, ఆక్సి మీటర్లు రెడీమిసివర్ ఇంజక్షన్లు రెండు వేల డోసుల వరకు ఉన్నాయన్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమించేం దుకు ఆస్పత్రిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం, కమాండ్ కంట్రోల్ రూమ్ క్యాజువాలిటీకి ఎదురుగా ఏర్పాటుచేసి వార్డులలో వాకిటాకీ లు ఏర్పాటు చేసి ఒకేసారి ఎనిమిది మంది డాక్టర్లకు సమస్య తెలిసేలా ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్లును ఎప్ప టికప్పుడు సమన్వ య పరిచి పేషెంట్ పట్ల అప్రమత్తం అయ్యి బాధితులకు మెరుగైన వైద్యం అందించి, ప్రణాళిక తో ముం దుకు వెళ్తున్నామన్నారు. కరోనా తో ఏ ఒక్కరి ప్రాణం పోకుండా డాక్టర్లు మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నారన్నారు.