Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండా పాలనలో కరోనా కట్టడి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి
- ఘనంగా సుందరయ్య 36వ వర్ధంతి
నవతెలంగాణ-కాశిబుగ్గ
బతికినంత కాలం పేదల కోసం, దోపిడీ రహిత సమాజ ఏర్పాటుకు పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు పాటుపడతామని సీపీఐ(ఎం) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి అన్నారు. 14వ డివిజన్ సుందరయ్య నగర్ లో బుధవారం ఏర్పాటు చేసిన పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతిలో పార్టీ జెండా ఆవి ష్కరించి ఆయన మాట్లాడారు. సుందరయ్య యుక్తవయస్సులోనే నిత్యావసర ధరలు పెరిగితే మద్రాసు నుండి సరుకులు తెచ్చి ఆరోజుల్లోనే రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేశారని గుర్తు చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యేగా నియోజకవర్గం మొత్తం సీపీఐ(ఎం) ఆఫీసులు కేంద్రాలుగా రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేశారని అన్నారు. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ఎర్రజెండా పార్టీలు అధికారంలో ఉన్న చైనా, వియత్నాం, క్యూబా లాంటి దేశాలతోపాటు మనదేశంలో కేరళ రాష్ట్రం తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు. కేరళ ఆరోగ్యశాఖ మంత్రికి ఐక్యరాజ్యసమితి సత్కారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యం పూర్తిగా ప్రై వేటీకరణ వల్లే ఈదుస్థితి నెలకొందని అన్నారు. సుందరయ్య వారసులుగా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటితోపాటు 50 పడకలతో హైద రాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఖమ్మం, మేడ్చల్ (ప్రగతి నగర్) లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో వరంగల్ ఉర్సు గుట్ట వద్ద 20 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాగుల రమేష్ మాట్లాడుతూ ఇలాంటి విప త్కర పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు తమ కుటుం బాలను కాపాడుకుంటూనే బాధిత కుటుం బాలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. 40 సంవత్సరాల క్రితం సుందరయ్య పేరుతో కాలనీ ఏర్పాటు చేసుకున్న సుందర య్యనగర్ వాసులు ఆయన వర్ధంతి వేడుకలను జరపడం సంతోషకరమన్నారు. పార్టీ ఆధ్వర్యం లో చేపట్టిన భూ పోరాటాల వల్ల 20 వేల కుటుంబాలకు నేడు నగరంలో నివాస స్థలాలు ఏర్పడ్డాయని అన్నారు. సీపీఐ(ఎం) కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి ఎండీ బషీర్, పార్టీ నాయకులు వంగరి రవీందర్, గోవర్ధన్ రాజ్, చిలువేరు ప్రశాంత్, చిలువేరు రవీందర్, డిష్ రాజు, ఎండి సుల్తానా, దయ్యాల లక్ష్మి, పాషా పాల్గొన్నారు.
ఆదర్శ కమ్యూనిస్టు నేత
పుచ్చలపల్లి సుందరయ్య
నర్సంపేట : నీతి, నిజాయతీకి పుచ్చలపల్లి సుందరయ్య చెరగని ముద్ర అని సీపీఐ(ఎం) రూరల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య అన్నారు. బుధవారం సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన పుచ్చపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సభలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. కార్మిక, కర్షక, పీడిత ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందిన సుందరయ్య ఆశయాలు ఎందరి గుండెల్లో గూడుకట్టుకున్నాయని తెలిపారు. దశాబ్ధాలు గడిచినా ఆయన పేరు, రూపం, జ్ఞాపకాలు నేటి తరానికి తీపి గుర్తులుగానే మిగిలిస్తున్నాయన్నారు. సుందరయ్య రగిల్చిన విప్లవస్ఫూర్తి ముందుకు పోతూనే ఉంటుంద న్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కోట్లాది మందికి విప్లవ స్పూర్తి అని ఆయన తుది శ్వాసవరకు ఎర్రజెండాను దేశవ్యాపితంగా రెపరెపలాడించాడని తెలిపారు. సుందరయ్య ఆశయ సాధనకోసం పనిచేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అనంతగిరి రవి, నాయకులు గుజ్జుల ఉమా, గడ్డమీది బాలకష్ణ, కందికొండ రాజు నిమ్మలబోయిన రమేష్, సింగారపు బాబు కత్తి రజిని, నాగమణి, మాదాసి సునీత, వజ్జంతి విజయ, మధు, చిలుక సారంగం విలియం కేరి, ఎడ్ల శివ పాల్గొన్నారు.
వ్యకాస ఆధ్వర్యంలో...
వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడిన యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య అన్నారు. బుధవారం వ్యకాస కార్యాలయంలో బుర్రి ఆంజనేయులు అధ్యక్షతన సుందరయ్య 36వ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించిన సుందరయ్య దేశ స్వతంత్య్రం కోసం సత్యాగ్రహం చేశారని, గాంధీ ఇచ్చిన ప్రతి పిలుపులో స్వతంత్య్ర పోరాటంలో ప్రజలను భాగస్వామ్యులను చేశారని తెలిపారు. అనంతరం దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. అగ్ర కులాల ఆధిపత్యం కొనసాగుతుండగా ఆ రోజుల్లో దళితులను, పేదలకు సమీకరించి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, కుల వివక్షతకు రూపు మాపడంలో సుందరయ్య పోరాడారని గుర్తు చేశారు. తన యావదాస్తిని పేద ప్రజలకు దళి తులకు ఖర్చు పెట్టారని, ఈ దేశ ప్రజానికానికి సేవ చేయడానికి తనకు సంతానం ఉంటే ప్రజలకు సరైన సేవ చేయాలనే తలంపుతో పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ చేసుకుని ప్రజలే ఆస్తిగా భావించిన ి మహౌన్నతమైన వ్యక్తి సుందరయ్య అన్నారు. దేశానికి ప్రజాతంత్ర ఉద్యమానికి మొదటి మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ ని తిరుగులేని పార్టీగా నిర్మించడంలో కృషి చేశారని అన్నారు. అసెంబ్లీ పార్లమెంట్లో ప్రజల తరఫున సుందరయ్య విన్పించిన వాణి ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూను ఒప్పించి మెప్పించి ప్రశంసలు పొందారని తెలిపారు. అలగానిపాడులో సుందరయ్య స్థాపించిన వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా విస్తరించి నేడు 27 రాష్ట్రాలలో అతి పెద్ద సంఘంగా ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ పేరుతో అన్ని ప్రజా సంఘాల్లో పెద్ద ప్రజా సంఘం సంఘం గుర్తింపు సాధిం చిందన్నారు. వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేస్తున్న ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకు పోరాడిప్పుడే సుందర య్యకు నిజమైన నివాళి అన్నారు. వ్యకాస సంఘం జిల్లా అధ్యక్షులు సీహెచ్.రంగయ్య, గోవింద మౌనిక, మేకల సాంబయ్య, బుర్రి విల్సన్, తుమ్మ రాజు, బాలకష్ణ పాల్గొన్నారు.
ఆశయ సాధనకు పాటుపడాలి
ఖానాపురం : ఖానాపురం మండలంలోని అశోక్ నగర్గ్రామంలో సీపీఐ(ఎం) అధ్వర్యంలో బుధవారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు భూక్య సమ్మయ్య మాట్లాడు తూ సుందరయ్య దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించిన వారిలో ప్రథమ వ్యక్తి అని కొనియాడారు. పార్టీ కార్య కర్తలందరూ సుందరయ్య ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ధర్మరావుపేట గ్రామంలో సుందరయ్య వర్థంతిని యార ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండ ల కార్యదర్శి ముంజలసాయిలు, నాయకులు బీరం శ్రీనివాస్ కంది కట్లవిరేష్ ,చింతకింది తిరుపతి, కుదురుపాక రాములు ,చలపతి ఇ జగన్మోహన్ రెడ్డి, వీరయ్య పాల్గొన్నారు
ప్రజలేప్రాణం.. ఉద్యమమే ఊపిరి
సంగెం : ప్రజలే ప్రాణంగా ఉద్యమమే ఊపిరిగా ఆశయాలే ఆదర్శంగా చివరిదాకా నడిచిన కమ్యూనిస్టు వైతాళికుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని మండలంలోని మొండ్రాయి గ్రామంలో ఘనంగా నిర్వహిం చారు. వీరగోని రమేష్ సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బండబోయిన సారయ్య, గడ్డం లక్ష్మీనారాయణ, అజరుకుమార్ పాల్గొన్నారు.
వేలేరు : వేలేరు మండల పరిధి కన్నారం శివారు ఇచ్చులపల్లిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వేల్పుల రవి ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి రవి మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిరంతర అధ్యయనం చేసి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడమే సుందరయ్యకు నిజమైన నివాళి అన్నారు. వ్యవ సాయ కార్మిక సంఘం , పాలేర్లు సంఘా లను ఏర్పాటు చేసి అట్టడుగు పీడిత వర్గం హక్కులకు ఉద్యమాలు నడిపారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి రవి, మిడిదొడ్డి సంపత్, కొల్గూరి జయరాజు, మిడిదొడ్డి నరేష్, క్రాంతికుమార్, సాగర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : కమ్యూనిస్టు వైతాళికు డు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిద్దామని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పరికి మధుకర్ అన్నారు. బుధవారం ఉప్పరపల్లి గ్రామంలో సుందరయ్య వర్ధంతిశ్రీతీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది పేద ప్రజలకు తన భూమిని దానం చేశారని గుర్తు చేశారు. సుందరయ్య ఆశయాలతో మరింత ముందుకు పోదామని అన్నారు. గుళ్ళపల్లి స్వామి, మహమ్మద్ భాషమియా అందే యాకరాజు, సమ్మెట నాగేష్, చిన్న చారి, అనిల్, మహమ్మద్ బబ్బులు, తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి : మండలంలోని రుద్రగూడెం గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడియాల మనోహర్ మాట్లాడుతూ ఉన్నత కుటుంబంలో పుట్టి అట్టడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఈర్ల రవి, మోహన్ రెడ్డి ,రామ్మూర్తి, చేరాలు ,తదితరులు పాల్గొన్నారు.