Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
కరోనా కష్టకాలంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్విప,్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పారిశుధ్య సిబ్బంది, వలస కూలీలు, అనాధలు, ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల కోసం బల్దియా పరిధిలో 9 ఉచిత భోజన కేంద్రాలు ఏర్పాటు చేయగా కాజీపేట రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన సెంటర్ను వారు బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందజేయాలని రెమిడిసివర్ ఇంజక్షన్లతో పాటు ఆక్సీజన్,వెంటిలేటర్ లను అందుబాటులో ఉంచామన్నారు. నగరంలోని ప్రయివేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మందులు విక్రయించాలని అన్నారు. వాటి పనితీరు పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. నగర వ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 10వేలమందికి ఉచిత భోజన సదు పాయం కల్పించడం హర్షణీయమన్నారు. అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో లాక్ డౌన్ సమయంలో విధులు నిర్వర్తించే సానిటేషన్ సిబ్బందితో పాటు యాచకులు వలస కూలీలు అనాథలు భోజనం లేక ఇబ్బంది పడుతు న్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో తొమ్మిది సెంటర్లలో భోజన కేంద్రాలను ప్రారంభించా మన్నారు. గతంలో రూ .5 భోజనం ఉండేదని, ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో కాజీపేట, కలెక్టరేట్ హన్మకొండ మెటర్నటీ ఆస్పత్రి, అదాలత్, ఎంజీఎం సీకేఎం ఆసుపత్రి, అండర్ బ్రిడ్జి , వరంగల్ రైల్వేస్టేషన్, ఎనుమాముల మార్కెట్ మొదలగు కేంద్రాల ద్వారా ప్రతి రోజు అన్నదానం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ సత్యనారాయణ, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీరజాలి, సంకు నర్సింగ్, డీఈ నరేంధర్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, రవీందర్, యాదయ్య. ఏఈ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.