Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
'ప్రస్తుత కాలంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. కరోనా సోకకుండా వ్యక్తిగత భద్రత ముఖ్యం. గ్రామాల్లో పది కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైతే పాఠశాలలను హైసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఉపాయిగించాలి.' అని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రికొచ్చిన ప్రజలతో మాట్లాడి అవసరమైన మందులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కరోనా మందుల కిట్టును క్షుణంగా పరిశీలించారు. కరోనా పరీక్షలు తదితర వివరాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలు ఆస్పత్రిలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేయాలని తెలిపారు. పరీక్షలు చేసిన తదుపరి అక్కడే అవసరం ఉన్న వారికి మందులు ఇవ్వాలని చెప్పారు. మండలంలోని ఏ గ్రామంలోనైనా ఎక్కువ కరోనా కేసులు పెరిగితే ఆ గ్రామంలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో అధిక కరోనా కేసులు నమోదైతే ప్రభుత్వ పాఠశాలను క్వారంటైన్ సెంటర్లుగా ఏర్పాటు చేసి కరోనా సోకిన వారిని అందులో ఉంచాలని వివరించారు. ఆక్సిజన్ సీలండర్ల కొరత తీవ్రంగా ఉన్నందున ఆసుపత్రిలో ట్రాన్స్ మీటర్ల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
తహసీల్దార్ సత్యనారాయణ గ్రామాల్లోని సర్పంచులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు కరోనా వ్యాప్తి గురించి సమాచారాని తెలుసుకోవాలని సూచించారు. శుభకార్యాలకు 20మంది కంటే ఎక్కువగా ఉండకుండా అనుమతి ఇవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని అన్నారు. భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత, మాస్క్ పెట్టుకోవడం వంటి వాటిని విధిగా పాటించాలని చెప్పారు. ఆమెవెంట డీఎంఎచ్ఓ మధుసూదన్, స్థానిక వైద్యులు వెంకటేష్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, ఎంపీడీఓ రాంమ్మోహనచారి, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీఓ రాంమ్మోహన్, రైబస మండల అధ్యక్షుడు సురేందర్రావు, ఎంపీటీసీ రాంచందర్, ఎల్టి ప్రభాకర్, సూపర్వైజర్ భీమా, తదితరులు ఉన్నారు.