Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పలిమెల
పలిమెల మండల పరిధి లంకెలగడ్డ, పంకెనలోని పల్లె ప్రకృతి వనం, స్మశానవాటిక పనులను జెడ్పీ సీఈఓ శోభారాణి బుధవారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో కలుపు మొక్కలను తొలగించాలని కార్యదర్శికి సూచించారు. లంకెలగడ్డ గ్రామంలో స్మశానవాటిక పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అంబటిపల్లి పీహెచ్సీలో కోవిడ్ టెస్టుల నిర్వహణ తీరును పరిశీలించారు. పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేశారు. కోవిడ్ పాజిటివ్ వస్తే వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా చేతి గ్లౌజులు మొహానికి మాస్కులు ఇచ్చి పంపాలని అంబటిపల్లి పీహెచ్సీ వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధిజారి శశిధర్‌రెడ్డి, మహాదేవపూర్ ఎంపీడీఓ క్రిష్ణవేణి, పలిమెల మండల పంచాయతీ అధికారి రాంప్రసాద్ రావు, పలిమెల ఈజీఎస్ ఏపీఓ నాగేందర్ రెడ్డి, టీఏ మధుకర్, పంకెన కార్యదర్శి వరలక్ష్మీ, లంకెలగడ్డ కార్యదర్శి మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.