Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బాధిత కుటుంబాలకు సరుకులు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని గంగారం గ్రామ పంచాయతీలోని బంజర ఎల్లాపూర్ గ్రామంలో హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా బాధిత ఆదివాసీ కుటుంబాలకు గంగారం సబ్ సెంటర్ ఎంపీహెచ్ఏ(ఎఫ్), ఏఎన్ఎం మోకాళ్ల సునీత బుధవారం గుడ్లు, కూరగాయలు, పప్పులు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఔదార్యం చాటుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఆమె కొడుకులు, కూతురు భాను, చెర్రీ, నందిత చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆపద వచ్చినప్పుడు సాయం చేయాలని భావన పిల్లలకు బాల్యంలోనే అలవర్చాలనే భావనతో తన పిల్లల చేతుల మీదుగా పంపిణీ చేశానని తెలిపారు. కరోనా పట్ల భయపడ వద్దని చెప్పారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, శానిటైజర్ ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రభుత్వాలు అమలు చేసిన లాక్డౌన్ను ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. 45 ఏండ్ల వయస్సు కలిగిన అందరూ టీకా వేయించుకోవాలని తెలిపారు. వైద్య సిబ్బంది, ఆశాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.