Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుద్ధపల్లి సుదర్శన్‌రెడ్డి (88) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, మండల ప్రచార కార్యదర్శి బానోత్ మోహన్‌జీ మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డి సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో చొరవ చూపారని కొనియాడారు. తుది శ్వాస ఉన్నంత వరకు పార్టీలో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ఉపేందర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నివాళ్లు..
సుదర్శన్‌రెడ్డి మృతదేహానికి ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోతు హరి సింగ్ నివాళ్లర్పించారు. వైస్ ఎంపీపీ తాతా గణేష్, సొసైటీ వైస్ చైర్మెన్ గంగుల సత్యనారాయణ, ఎంపీటీసీ తిరుమల శైలజ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ దనసరి కోటమ్మ, గౌరవ సలహాదారులు సొందు సార్, కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఉపేందర్, వెంకటేశ్వర్లు, కృష్ణ, వెంకన్న, నాగేందర్, వీరన్న, తదితరులు నివాళ్లర్పించారు.