Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
హోమ్ ఐసోలేషన్లో ఉన్న కుటుంబాలకు యువకులు భోజన ప్యాకెట్లు బుధవారం పంపిణీ చేశారు. మండల కేంద్రంలో కరోనాతో బాధపడుతూ హౌం ఐసోలేషన్ లో ఉంటున్న వారికి బుధవారం బయ్యారం మిత్రులు ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీఓ చలపతిరావు పాల్గొని కరోనా బాధితులకు ఉచిత భోజనం అందించారు. అనంతరం టీమ్ సభ్యులు జగ్గుతండ పంచాయితీ పరిధిలో హౌం ఐసోలేషన్లో ఉంటున్న వారికి కూరగాయల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బయ్యారం మిత్రులు మాట్లాడారు. కరోనాతో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వారికి ప్రతిరోజు ఉచితంగా భోజనం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తుడుం రాజేష్, కొత్త వినరు బాబు, చల్లా గోవర్ధన్, గండు సురేష్, గండు నరేష్, గండు బాలకృష్ణ, గంట శ్రీనివాస్, ఎచ్చు రమేష్, తదితరులు పాల్గొన్నారు.