Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల కుటుంబాలకు పోరిక పరామర్శ
- ఏఎన్ఎం, ఆశావర్కర్లకు సన్మానం
నవతెలంగాణ-ములుగు
కరోనా బాధితులకు ఆసరా అందిస్తామని టీఆర్ఎస్ పార్టీ ములుగు నియో జకవర్గ నాయకుడు పోరిక గోవింద్‌నాయక్ తెలిపారు. మండలంలోని జాకారం సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం తిరుమల, ఆశా కార్యకర్తలు వసంత, నసీమాలను గోవింద్‌నాయక్ శాలువాతో బుధవారం సన్మానించి సత్కరించారు. అనంతరం కరోన వైరస్ బారిన పడి ఇబ్బందులు గురి అవుతున్న కుటుంబల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన గుండా కనకమ్మ, తోట రాజయ్య, తోట రాధక్క, అగుళ్ల సత్యం, ముదాం మల్లమ్మ, మెరుగు లక్ష్మీల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా గోవింద్ నాయక్ మాట్లాడారు. కరోనా సమయంలో వ్యాధితో ఇబ్బందులు పడుతున్న వారిని వెళ్లి కలిసి మనోనిబ్బరంగా కలిపిస్తున్నామన్నారు. తోటి వారు కూడా సూచనలు ఇస్తూ అండగా నిలవాలని కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ఇంటింటికీ తిరుగుతున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. లాక్డౌన్ విజయవంతం చేయాలని కోరారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మంచోజు బ్రహ్మచారి, ఒద్దుల ఐలయ్య, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.