Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
కరోనా కష్టకాలంలో పారిశుద్య కార్మికుల సేవలు మరువ లేనివని హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిలేషన్ షిప్ మేనేజర్ పొన్నోజు శివకుమార్ అన్నారు. మండలంలోని సీతంపేటలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ అయిన పారిశుద్య కార్మికులు, ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్సీ మేనేజర్ తోకల మనోజ్‌రెడ్డి, సీతంపేట కార్యదర్శి యాకలక్ష్మీ, ఎంపీటీసీ రజితచేరాలు, ఉపసర్పంచ్ తోకల భగవాన్‌రెడ్డి, వార్డు మెంబర్ క్రిష్ణాది శ్యామలరమేష్, కాశివిశ్వేశ్వర దేవస్థానం చైర్మన్ క్రిష్ణాది రాజేష్, ఆదిరెడ్డి, సూర సురెందర్, చింటు, పండు పాల్గొన్నారు.
ఖిలా వరంగల్ : కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివని 37వ డివిజన్ కార్పొరేటర్ సువర్ణ-సురేశ్ అన్నారు. గురువారం డివిజన్లోని పారిశుధ్య కార్మికులకు మాస్క్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆరోగ్య, పోలీసు సిబ్బందితో సమానంగా మున్సిపల్ సిబ్బంది తమ విధులను కొనసాగిస్తున్నారని, కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్‌కుమార్, జవాన్ హరినాద్ పాల్గొన్నారు.