Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
రానున్న వానకాలంలో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షిం చాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. గురువారం ఆయన మంకీ పుడ్ కోర్టులో పూల, పండ్ల మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పచ్చదనం వలన వాతవరణం ఆహ్లదకరంగా మారడంతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. మంకీ పుడ్ కోర్టులో దాదాపుగా 16 వందల చెట్లు పెరిగాయని, దీంతో ఈ ప్రాంతం అంతా ఆహ్లాదకరంగా మారిందన్నారు. వరంగల్ మహానగర్ పాలక సంస్థ ఆధ్వర్యంలో మొక్కలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అవసరమైన వారు తనను సంప్రదిస్తే ఉచితంగా మొక్కలు అందజేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ హెచ్ఓ ప్రిసిల్లా, మరుపల్ల గౌతం పాల్గొన్నారు.