Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్ 66వ డివిజన్ హసన్పర్తికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కందుకూరి చంద్రమోహన్ సోదరుడు కందుకూరి రామ్మోహన్(58) గత 15 రోజుల క్రితం కరోనాతో మృతి చెందాడు. అప్పటికే తండ్రి బుచ్చయ్య (74) కరోనా పాజిటీవ్‌తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రామ్మోహన్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు గొప్యంగా ఉంచి బుచ్చయ్యకు మెరుగైన వైద్య సహాయం అందిస్తూ వస్తున్నారు. గురువారం బుచ్చయ్య పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి బుచ్చయ్య తన కుమారుడు రామ్మోహన్‌కు ఫోన్ చేసి మాట్లాడాలని టీఆర్ఎస్ నాయకుడు చంద్రమోహన్‌ను పట్టుబ ట్టాడు. దీంతో అసలు విషయం తెలిసిన బుచ్చయ్య తన కొడుకు మరణ వార్తను జీర్ణించుకోలేక హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులను కలిచివేసింది.