Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, సరైన కారణం లేకుంటే తిరిగే వాహ నాలను సీజ్ చేస్తామని భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు హెచ్చరించారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీ, రాంనగర్, రెడ్డి కాలనీ, గాంధీనగర్‌లో లాక్ డౌన్ పరిస్థితిని పర్యవేక్షించారు. అంబేద్కర్ సెంటర్లో వాహనదారులను అప కారణాలు అడిగి, అనవ సరంగా బయటికి వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేయాల్సిందిగా డీిఎస్పీ, సీఐను ఆదేశిం చారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఉదయం 10 గంటల కల్లా ఇంటికి చేరుకోవాలని, 10 గంటల నుంచి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మరో విడత లాక్‌డౌన్‌కు అవకాశం లేకుండా ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలు నిత్యవసర వస్తువులు, మందుల కొనుగోలుకు వెళ్లినప్పుడు దుకాణం వద్ద సామాజిక దూరం పాటించాలన్నారు. జిల్లాలో కరోనా చికిత్సకు అవసరమయ్యే మందులు, ఇంజ క్షన్లు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, సిటీ స్కాన్‌కు ప్రభుత్వ నిర్దేశిత ఫీజులను తీసు కోవాలన్నారు. ఎక్కువగా వసూలు చేస్తే పోలీసులకు తెలపాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ వాసుదేవరావు, ఎస్సైలు అభినవ్, నరేష్, ఉదరు కిరణ్, పాల్గొన్నారు.