Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి
నవతెలంగాణ-కాశిబుగ్గ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత భోజన సదుపాయన్నీ పేదలు సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోరారు. గురువారం బల్దియా మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన 14వ డివిజన్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్ర మాన్ని ప్రారం భించి మాట్లాడారు. లాక్ డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను వలస దారులను, యాచకులను దృష్టిలో ఉంచుకొని మున్సి పల్శాఖ వారు ఉచిత భోజనాన్ని అందించడం గొప్ప విషయమన్నారు. పేదలకు ఒక్కరికి 10 కిలోల బియ్యం, నగదు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మె న్ చింతం సదానందం, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ, సీనియర్ నాయకులు కేతిరి రాజశేఖర్, గండ్రతి భాస్కర్, పత్రి రాజ పోషలు, చిలువేరు శ్రీనివాస్, యాదగిరి, గోవింద్, రాజు, యాదగిరి, రాజేందర్, మల్లయ్య, స్టాలిన్ పాల్గొన్నారు.