Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
మండలంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుదినం కృషి చేస్తున్నారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లా కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి స్త్రీనిధి ద్వారా ఐదు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనేది సీఎం లక్ష్యం అని పేర్కొన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉన్నందున ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించి లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని కోరారు. స్వచ్ఛందంగా హౌమ్ క్వారంటైన్ లో ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను విధిగా పాటించాలని వివరించారు. ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన వారికి అండగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహా నాయక్, మండలం రైతు బందు సమితి అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ బిల్లా సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, తదితరులు పాల్గొన్నారు.