Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రక్ షీట్లో 54బస్తాల తగ్గింపు.. ఆందోళన చేపట్టిన రైతులు
నవతెలంగాణ-శాయంపేట
రైస్ మిల్లర్లు ట్రక్ షీట్ లో 680 బస్తాలకు గాను 626 బస్తాలు దిగుమతి చేసుకున్నట్టు చూపుతూ రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు గురువారం సాయంత్రం రైస్ మిల్లర్ల తో వాగ్వివాదానికి దిగడమే కాక రైస్ మిల్లు ముందు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని వసంతపూర్ గ్రామంలో రైతు సొసైటీ ఆధ్వర్యంలో యాసంగి సీజన్‌కు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. దీంతో రైతులు ముత్తా రపు కట్టయ్య, మోకీడే మహేందర్, రాజేశ్వరరావు, రాజేందర్, బాపురావు ప్రైవేట్ లారీ మాట్లాడుకొని వచ్చి తమ 680 బస్తాలను మంగళవారం శాయంపేట మండలం లోని తాహారాపూర్ గ్రామ శివారులోని శ్రీనివాస రైస్ మిల్ కు పంపించారు. ధాన్యం లారీని వే బ్రిడ్జి వేసుకొని పరకాల మార్కెట్ కేంద్రంలోని గోదాం కు పంపించారు. హమాలీలు బస్తాలను దిగుమతి చేసుకోగా అక్కడే ఉన్న గుమస్తా 680 బస్తాలు దిగుమతి అయ్యాయని పేపర్ పై రాసిచ్చాడు. ఆ పేపర్ ను రైస్ మిల్లు లో అప్పగించగా ట్రక్ షీట్ రైతులకు అందించారు. అందులో కేవలం 626 బస్తాలు దిగుమతి అయినట్టు గుర్తించి 54 బస్తాలు సుమారు 22 క్వింటాళ్ల ధాన్యం తక్కువ నమోదైనట్టు గుర్తించారు. విషయాన్ని రైస్ మిల్లర్లతో మాట్లాడగా మీరు ఇన్ని బస్తాలు తెచ్చారని, రైతులపైనే దురుసుగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న వసంతపూర్ రైతు సొసైటీ నాయకులు, రైతులు చేరుకొని రైస్ మిల్లు ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్సై అక్కినపల్లి ప్రవీణ్‌కుమార్, పీఎస్సై లవన్‌కుమార్, సిబ్బందితో చేరుకొని రైతులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. రైతులతో, రైస్ మిల్లర్ యజమాన్యం తో విడివిడిగా మాట్లాడారు. సమస్య పరిష్కరించేంత వరకు వెళ్ళేది లేదని రైతులు ఆందోళన కొనసాగించారు.
'నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అమ్మాలి'
నవతెలంగాణ-నర్సంపేట
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మాత్రమే అమ్మకాలు చేయాలని ఏడీఏ టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం స్థానిక రైతు వేదికలో డీలర్లతో నిర్వహించిన 2021 వానకాల సీజన్ అవగాహన కార్యక్రమంలో ఏడీఏ మాట్లాడారు. వానకాలం సీజన్‌కు ముందే రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. డీలర్లు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎంఆర్పీకి లోబడి విక్రయిం చాలన్నారు. రైతులకు తప్పని సరిగా రశీదు ఇవ్వాలన్నారు. ఎరువులను ఈపాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు చేయాలన్నారు. డీలర్లు స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్కులు చట్ట పరంగా నిర్వహించాలన్నారు. దుకాణం ఎదుట స్టాక్ బోర్డుపై రోజు వారిగా నిల్వలను పేర్కొనాలని తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వ్యక్తిగత దూరం, మాస్కులు విధిగా ధరించి విక్రయాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టీ.కృష్ణకుమార్, డీలర్ల సంఘం అధ్యక్షులు బొద్దిరెడ్డి నర్సింహారెడ్డి, ఏఈవోలు ఎం.అశోక్, కే.నవీన్చ, ఎం.భరత్, విత్తన, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.