Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజలు మనోధైర్యంతో జీవనం సాగించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం రేగొండ మండలానికి చెందిన కందుకూరి శంకరా చారి భూపాలపల్లిలోని 100 పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనాతో పోరాడి మృతిచెందాడు. కాగా భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొని మృతుడికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. ప్రజలు కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే హాస్పిటల్కి వెళ్లి పరీక్ష చేసుకుని వైద్యుల సూచనలు పాటించాలన్నారు. ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కరోనాను పూర్తి ఇంటివద్దనే ఉండి నయం చేసుకోవచ్చన్నారు. అత్యవసరం అయితే హాస్పిటల్లో చేరి చికిత్స పొందాలన్నారు. కరోనా తో ఎవరైనా మరణిస్తే వారి గ్రామంలోనే కణనం చేసేందుకు ప్రజలు తోడ్పాటందించాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, వారికి డబల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వెంకట రాణి సిద్ధు, మండల అధ్యక్షుడు సాంబమూర్తి, జాగృతి జిల్లా నాయకులు మాడ హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు రవీందర్, అనిల్, రవికుమార్, శారద పాల్గొన్నారు.