Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
నేరాల నియంత్రణ, ప్రజాప్రతినిధులకు బందోబస్తు, శాంతి భద్రతల రక్షణ, బాధితులకు అండగా నిలబడే పోలీసులు అన్నదాతలు పడుతున్న కష్టాలను గుర్తించి రైతాంగానికి బాసటగా నిలిచారు. రవాణా కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో వరంగల్ లారీ అసోసియేషన్ పాలకవర్గంతో మాట్లాడి ఒక్కొక్క కేంద్రానికి రెండు లారీల చొప్పున పంపించి కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించారు. శాయంపేట మండల పరిధి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ 4, ఓడీసీఎంఎస్ 2, ఎంఎంఎస్ ఆధ్వర్యంలో 2 మొత్తంగా 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రవాణా కాంట్రాక్టర్ సంపత్ నిర్లక్ష్యం వల్ల లారీలు అరకొరగా పంపుతుం డడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిస్తే ధాన్యం తడుస్తుందని రైతులు సీఐ తోగిటి రమేష్ కుమార్, ఎస్సై అక్కినపల్లి ప్రవీణ్ కుమార్, పరకాల ఏసీపీ శ్రీనివాస్ దష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఏసీపీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల తన ఛాంబర్ లోనే సివిల్ సప్లై డీఎం భాస్కర్, ఆర్డిఓ మహేందర్ జి, ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డితో లారీల సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులను, ఎంపీపీ తిరుపతిరెడ్డి తో కలిసి వరంగల్ లోని లారీ అసోసియేషన్ పాలక వర్గ సభ్యులతో మాట్లాడి 25 లారీలన మండలం లోని ప్రతి ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలకు 2 లారీల చొప్పున పంపించి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. దీంతో రైతులు పోలీసులకు కతజ్ఞతలు తెలిపారు.