Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘణపురం చెరువులో చేపల మృత్యువాత
నవతెలంగాణ-రాయపర్తి
మండలకేంద్రంలోని కొత్త రాయపర్తి శివారు ఘణపురం చెరువులో (మారమ్మ చెరువు)మూడు రోజుల కాల వ్యవధిలో చేపలు విలవిల కొట్టుకొని అధిక సంఖ్యలో మత్యువాత పడ్డాయి. చెరువులో ఉన్న చేపల పంట చేతికొచ్చే సమయంలో నాలుగు టన్నుల మేర చేపలు చనిపోయాయని, దీంతో గంగపుత్రుల ఉపాధి వెలవెల పోతుందని గంగపుత్రుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం బాధితులు విలేకర్లతో మాట్లాడారు. సుమారు రూ.5లక్షల నష్టం వాటిల్లిందని వాపోయారు. రెండేండ్లుగా చెరువులో చేపలను పెంచుతున్నామని తెలిపారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందే సమయంలోనే ఒక కేజీ నుండి 5 కేజీల వరకు ఉన్న చేపలు మత్యువాత పడడంతో తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 60 కుటుంబాలు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, సంబంధిత మత్స్యశాఖ, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. సర్పంచ్ పిల్లి కొమురయ్య, ఉప సర్పంచ్ పూజారి సంతోష్, గంగపుత్ర సంఘం సభ్యులు పిల్లి మల్లయ్య, మైస వెంకటేశం, రవీందర్, శ్రీను, పూస కుమార్, మహేందర్, రమేష్, సాగర్ పాల్గొన్నారు.