Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బాధితులకు సరుకులు పంపిణీ
నవతెలంగాణ-గూడూరు
ఎమ్మెల్యే శంకర్‌నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంపీటీసీ నూకల రాధిక సురేందర్ ఆధ్వర్యంలో మండలం కేంద్రంలోని కరోనా బాధితులకు గురువారం కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమ్మక్క, వెంకన్న, రహీంపాషా, సురేష్, ఎల్లయ్య, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
వైద్యసిబ్బందికి చీరలు పంపిణీ
ఎమ్మెల్యే శంకర్‌నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మహిళా వైద్య సిబ్బంది తీగలవేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని, అయోధ్యపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మహిళా ఉద్యోగులకు వేర్వేరుగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకటకష్ణారెడ్డి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వెంకన్న, శ్రీహరి, సమ్మక్క, రహీమ్, విజరు, వేణుమాధవ్‌రెడ్డి, సురేష్, వెంకన్న, నవీన్, సూరయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఏపూరులో కరోనా బాధితులకు..
ఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ రామన్న నాయక్ ఆధ్వర్యంలో ఏపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 25 కరోనా పాజిటివ్ కుటుంబాలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామన్న నాయక్ మాట్లాడారు. ఎమ్మెల్యే చొరవ వల్లే జిల్లాకు వైద్య కళాశాల మంజూరైందని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ రాజకీయంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ కమిటీ సభ్యులు ధారావత్ కష్ణ, బానోత్ చందూలాల్, వార్డు సభ్యులు భూక్యా బిక్కునాయక్, వాంకుడోత్ రాముడు, బయ్య శ్రీకాంత్, బయ్య శ్రీను, తదితరులు పాల్గున్నారు.