Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని అయోధ్యపురం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ కొమురయ్య గురువారం సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. కొనుగోళ్లపై నిర్వాహకులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మీ, ఏపీఎం రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో డీఏఓ పరిశీలన
మండలంలోని అయోధ్యపురం గ్రామంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని డీఏఓ ఛత్రునాయక్ సందర్శించి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. కాంటా అయిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు చేర్చాల్లన్న రైతుల విజ్ఞప్తికి స్పందిస్తూ సివిల్ సప్లై జిల్లా మేనేజర్ మహేందర్‌కు క్షేత్ర స్థాయిలోని సమస్యలను వివరించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాకాలానికి ఎరువుల నిల్వ కోసం స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో ఎరువులు నిల్వ చేసేందుకు స్థలాన్ని పరిశీలించారు. గోదాములో ఉన్న వరి ధాన్యాన్ని తరలించిన వెంటనే ఎరువులను నిల్వచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అల్లె రాకేష్, ఎంపీడీఓ విజయలక్ష్మీ, ఏఈఓ శిల్ప, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.